నిన్నతిట్లు, ఇవాళ ఆటలు,నాగ్ హోస్టింగ్ అదుర్స్

Published on Sep 15, 2019 8:10 pm IST

బిగ్ బాస్ షో వారాంతములో జరిగే శని, ఆదివారాలు ఎపిసోడ్స్ ప్రత్యేకం. ఎందుకంటే ఆ రోజు బిగ్ బాస్ హోస్ట్ వారం మొత్తం ఇంటి సభ్యుల ప్రవర్తనపై సమీక్షలు, సలహాలు, సరదాలతో సాగిపోతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ రెండురోజులు మాత్రమే ఈ రియాలిటీ షో చూసే వారు చాలా మంది వుంటారు. అందుకే ఈ కార్యక్రమానికి శని, ఆదివారాలలో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుంది.

నిన్న శనివారం నాగార్జున రావడమే ఆవేశంగా వచ్చారు. ఆయన ఎంట్రీ సాంగ్ ని కూడా మధ్యలోనే ఆపించి కోపం వ్యక్తం చేశారు. ఇక ఇంటి సభ్యులలో వారి వారి ప్రవర్తన ఆధారంగా వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా శ్రీముఖి, మహేష్ విట్టా, పునర్నవి లను గట్టిగా మందలించడం జరిగింది. నిన్న జరిగిన పరిణామాల రీత్యా నేడు నాగార్జున కి ఇంటి సభ్యులు సీరియస్ ముఖాలతో కనిపించగా, ఫన్ డే రోజు అలా ఉన్నారేంటని వారితో సరదా ఆటలు ఆడించి నవ్వులు కురిపించారు.ఇదంతా నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. హోస్ట్ గా నాగ్ లోని ఈ వేరియేషన్స్ ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More