ఎలాంటి హడావుడీ లేకుండా తన తర్వాతి చిత్రం ‘వైల్డ్ డాగ్’ ను ప్రకటించి హీరో అక్కినేని నాగర్జున అభిమానుల్ని సప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న నాగార్జున సైతం చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. కొత్త షెడ్యూల్ కోసం ఆయన ముంబై వెళ్లారు.
ఈ నెల 9 నుండి అక్కడ షూటింగ్ మొదలుకానున్న ఈ షెడ్యూల్లో సీక్రెట్ మిషన్ కు సంభందించిన
కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు టీమ్. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ ఏజెంట్ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నారు. చాన్నాళ్ల తర్వాత నాగర్జున చేస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ చిత్రం ఇదే కావడం విశేషం. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.


