వైల్డ్ డాగ్ గా వస్తున్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నాగార్జున

nag

కింగ్ నాగార్జున లేటైనా కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ముందుకొచ్చారు. ఆయన కొత్త సినిమా టైటిల్ తో పాటు ఆ సినిమాలో తన రోల్ కి సంబంధించి డిటైల్స్ విడుదల చేసి ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ నాగార్జున చేస్తున్న ఆ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసా..? ‘వైల్డ్ డాగ్’. అవును నాగార్జున చేస్తున్న తదుపరి మూవీ టైటిల్ ‘వైల్డ్ డాగ్’. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఎన్ ఐ ఏ అధికారిగా నాగార్జున నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదల చేయడం విశేషం.

మాట్నీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు అహీతోష్ సోలొమన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి లు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొత్తతరానికి చెందిన సాంకేతిక నిపుణులతో, సరికొత్త పద్దతిలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని నాగార్జున ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Exit mobile version