కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సోషియో ఫాంటసి డ్రామా చిత్రం ‘డమరుకం’ చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వి.ఎఫ్.ఎక్స్ పనుల ఆలస్యమవుతున్న విషయం మనకి తెల్సిందే. అగ్ర దర్శకుడు రాజమౌళి రెండేళ్ళ పాటు కష్టపడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఈగ’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ విషయంలో ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో రాజమౌళి ఏ మాత్రం రాజీ పడకపోవడంతో ఆలస్యంగా విడుదలైనా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఈ విషయంలో డమరుకం చిత్ర దర్శకుడు కూడా ఈగని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. చిత్ర విడుదల ఆలస్యమైనా డమరుకం చిత్రాన్ని క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. నాగార్జునకి జంటగా అనుష్క నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆ విషయంలో ‘ఈగ’ని ఫాలో అవుతున్న డమరుకం
ఆ విషయంలో ‘ఈగ’ని ఫాలో అవుతున్న డమరుకం
Published on Jul 10, 2012 8:41 AM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: దుల్కర్ గ్యాంబ్లింగ్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’ వాయిదా.. కొత్త డేట్ ఇదే!
- అక్కడ మార్కెట్ లో ‘కొరియన్ కనకరాజు’ డామినేషన్!
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘టాక్సిక్’ సెన్సార్ కట్స్.. ఆ రూమర్స్ లో నిజం లేదా?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”
- అనుపమ చెప్పిన ఆ ‘అపరిచితుడు’ ఎవరు?
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- సైలెంట్‌గా రూట్ మార్చిన శ్రీలీల.. టాలీవుడ్‌కి గ్యాప్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- ‘ఇరుముడి’ ట్రైలర్ టాక్ : భక్తి, యాక్షన్ కలగలిపిన మాస్ ఎమోషనల్ డ్రామా!


