
కెరీర్ ప్రారంభం నుంచి ఒకే రకమైన రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని అటెంప్ట్ చేసిన హీరో కింగ్ నాగార్జున. ‘మనం’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగార్జున చేస్తున్న మరో డిఫరెంట్ సోషియో ఫాంటసీ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’. నాగార్జున రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత కొద్ది రోజులుగా లండన్ లో కార్తీ తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న నాగార్జున ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడు. అక్కడి నుంచి రాగానే సోగ్గాడే చిన్ని నాయనా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ప్రస్తుతం నాగార్జున – అనసూయలపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీం నుంచి అందింన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 20 కళా ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేస్తున్నారు. రెండు డిఫరెంట్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున వేరు వేరు గెటప్స్ లో కనిపిస్తాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి నాగార్జున సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.