
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా, కార్తీ – వంశీ పైడిపల్లి సినిమాల షూటింగ్స్ లో కంటిన్యూగా బిజీ బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా నాగార్జున మరో తెలుగు స్టార్ హీరో కుమారుడు నటించనున్న సినిమాలో ఓ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే నాగార్జున చేతుల మీదుగా లాంచ్ అయిన నిర్మల కన్వెంట్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ కుమారుడు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తున్న ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
నాగార్జున ఈ సినిమాలో కనిపించడం సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. ఇటీవలే పిల్లలు మరియు నాగార్జున పై నిర్మల కన్వెంట్ రిలీజ్ చేసిన లాంగ్వేజ్ అఫ్ లవ్ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే నాగార్జున ఈ సినిమాలోనే కాకుండా అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. తను చేస్తున్న రెండు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాల్లో డిఫరెంట్ గెటప్స్ లో నాగార్జున తన అభిమానుల్ని థ్రిల్ చేయనున్నాడు.