‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం తరువాత యువ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘@నర్తనశాల’. నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం లో యామిని భాస్కర్ , కశ్మీర ప్రదేశి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది.
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐర క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మిస్తున్నఈచిత్రాన్ని ఆగష్టు 30 న విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో బాక్సాఫిస్ వద్ద పోటీపడనుంది. ఈచిత్రం ఆగష్టు 31న ప్రేక్షకులముందుకు రానుంది. మరి ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.


