‘ఫంకీ’లో ఇలాంటివి ఆశించకండి.. మరేం ఉందంటే!

Nagavamsi

ఈ ఫిబ్రవరిలో విడుదలకి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు అనుదీప్ కే వి తెరకెక్కించిన అవైటెడ్ క్లీన్ ఎంటర్టైనర్ చిత్రం ఫంకీ కూడా ఒకటి. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ ఆడియెన్స్ ని ఇప్పుడు ఆకట్టుకుంటుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ లో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

ఎప్పటిలానే తన సినిమాపై ఆడియెన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో మంచి కథ, ఎమోషనల్ సీక్వెన్స్ లు లాంటివి ఆశించకండి అని ముందే చెప్పేసారు. అయితే వీటికి బదులుగా మంచి ఫన్ ఆద్యంతం ఉంటుంది అని విశ్వక్ సేన్ లో అనుదీప్ ఆ రెండు గంటల సేపు కనిపిస్తాడు అని చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని రేపాయి. సో ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ ఫిబ్రవరి 13 వరకు ఆగాల్సిందే.

Exit mobile version