స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేసుకుంటున్న బంగార్రాజు ?

స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేసుకుంటున్న బంగార్రాజు ?

Published on Dec 15, 2019 10:00 AM IST

Nagarjuna

కింగ్ నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడా ఒకటి. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని తీయబోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్.. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయి చివరికీ డిసెంబర్‌లో ప్రారంభించాల్సి ఉంది. కానీ డిసెంబర్ లో కూడా స్టార్ట్ అయ్యేలా కనిపించడంలేదు. నాగార్జున స్క్రిప్ట్‌ విషయంలో ఇంకా పూర్తి సంతృప్తిగా లేరని.. స్క్రిప్ట్‌ లోని కొన్ని కీలక సీక్వెన్స్ స్ ను తిరిగి వ్రాయమని కల్యాణ్‌ ను కోరినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాదే వేస‌విలో కల్లా బంగార్రాజుని పూర్తి చేసి విడుద‌ల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

తాజా వార్తలు