దాదాపు పూర్తైన నాగార్జున చిత్రం !
Published on Mar 13, 2018 8:31 am IST

సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఆర్జీవీ దర్శకత్వంలో ‘ఆఫీసర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో మొదలైన చిత్రీకరణను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస షెడ్యూళ్లతో శరవేగంగా ముగించేశారు.

ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ నాగార్జున ట్విట్టర్ ద్వారా 99 శాతం షూటింగ్ ముగిసింది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్ పట్ల చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను అన్నారు. ఆర్జీవీ తన సొంత నిర్మాణ సంస్థ కంపెనీ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం మే 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

 
Like us on Facebook