
గత కొద్ది రోజులుగా తమిళ చిత్ర సీమలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హాట్ టాపిక్ నడిఘర్ సంఘం ఎలక్షన్స్. నిన్న ఉదయం చెన్నైలో ఈ నడిగర్ సంఘం ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ కి తమిళ స్టార్స్ అందరూ హాజరయ్యారు. నిన్న రాత్రి ఈ ఎలక్షన్స్ కి సంబందించిన రిజల్ట్స్ ని విడుదల చేసారు. ఈ ఎన్నికల్లో పండవర్ అని మరియు శరత్ కుమార్ మధ్య పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో పండవర్ అని టీం వారు యునానిమస్ గా గెలిచింది.
పండవర్ అని టీంలోని విశాల్, కార్తీ, నాజర్ లు మెయిన్ పోస్ట్ లలో ఎన్నిక అయ్యారు. విశాల్ నడిగర్ సంఘం జెనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యాడు. సీనియర్ యాక్టర్ నాజర్ ప్రెసిడెంట్ పోస్ట్ కి ఎన్నికైతే, కార్తీ ఏమో ట్రెజరర్ పోస్ట్ కి ఎన్నికయ్యాడు. విశాల్ టీంకి పోటీగా నిలిచిన శరత్ కుమార్ ఓటమిని అంగీకరించి పండవర్ అని టీంకి అభినందనలు తెలిపాడు. ముందుగా చెప్పినట్టుగానే పండవర్ అని టీం వారు అసోషియేషన్ లో ఇచ్చిన పనులను నెరవేరుస్తామని మాటిచ్చారు.