నమస్తే నేస్తమా ట్రైలర్ విడుదల

నమస్తే నేస్తమా ట్రైలర్ విడుదల

Published on Nov 9, 2019 9:00 PM IST

Namaste Nestama

శ్రీరామ్, ఈషానియ మహేశ్వరి, హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం నమస్తే నేస్తమా. కేసి బొకాడియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదలైంది. కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఫాస్ట్‌గా 50 సినిమాలు కంప్లిట్‌ చేసిన ఫిలిం మేకర్‌గా రికార్డ్‌ సాధించిన బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నమస్తే నేస్తమా’. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన ‘తేరి మెహర్భానియా’ చిత్రానికి పార్ట్‌-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు కె.సి.బొకాడియా.

నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యువ న‌టుడు శ్రీరామ్ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇస్తున్నారు. రెండు కుక్క‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి.బొకాడియా, చిత్ర సమర్పకులు గౌతమ్‌చంద్‌ రాథోర్‌, హీరోయిన్‌ ఈషానియ మహేశ్వరి, కో- ప్రొడ్యూసర్‌ ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, ఫైట్‌ మాస్టర్‌ బి.జె శ్రీధర్‌, రాజ్‌ కుమార్‌ బొకాడియా, నటుడు తాగుబోతు రమేష్‌ పాల్గొన్నారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు