‘శ్రీమంతుడు’లో నమ్రత రోల్ ఏంటంటే.!

‘శ్రీమంతుడు’లో నమ్రత రోల్ ఏంటంటే.!

Published on Jul 23, 2015 12:24 PM IST

Namrata

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీమంతుడు డబ్బింగ్ వర్క్స్ లో బిజీగా ఉంటే, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాతో హీరోగానే కాకుండా ఒక సహా నిర్మాతగా కూడా మారాడు. అందులో భాగంగానే జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ ని స్టార్ట్ చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ ఈ సినిమాని నిర్మించాడు. అందుకోసమే ఈ సినిమాకి మహేష్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్స్ లో కొంత షేర్ తీసుకోనున్నాడు.

మహేష్ బాబు ఈ ప్రొడక్షన్ సైడ్ తక్కువ ఇన్వాల్ అయితే ఎక్కువ భాగం తన అర్ధాంగి మరియు హీరోయిన్ అయిన నమ్రత శిరోద్కర్ చూసుకుంటున్నారు. తాజా నమ్రత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు శ్రీమంతుడులో తన రోల్ ఏంటనేది తెలియజేసింది. ‘ శ్రీమంతుడు ఫిల్మ్ మార్కెటింగ్ కి సంబందించిన బాధ్యత నేను తీసుకున్నాను. ఈ సరికొత్త జాబ్ చాలా ఆసక్తికరంగానూ, ఉత్కంఠగానూ ఉంది. ఒక సినిమా కోసం ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ తో అసోషియేట్ అయ్యి పనిచేయడం నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి కూడా హెల్ప్ అవుతోందని’ నమ్రత తెలిపింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు మొదటి సారి శృతి హాసన్ తో జోడీ కట్టాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు