విశ్వక్ సేన్ పై బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

విశ్వక్ సేన్ పై బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 29, 2024 1:04 AM IST


టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రం మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు.

ఈ మేరకు హీరో విశ్వక్ సేన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ సేన్ ను సోదరుడు అంటూ సంబోధించారు. ఒక తల్లి కడుపున పుట్టక పోయినా, ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే అంటూ చెప్పుకొచ్చారు. వయసులో నాతో పోటీ పడుతూ ఉంటాడు. నా అన్న అని అన్నారు. బాలయ్య చేసిన ఈ కామెంట్స్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాక డైరెక్టర్ కృష్ణ చైతన్య, హీరోయిన్స్ నేహ శెట్టి, అంజలి ల పై ప్రశంసల వర్షం కురిపించారు.

విశ్వక్ సేన్ మొదటి చిత్రం నుండి వైవిధ్యమైన చిత్రాలను, పాత్రలను చేస్తున్నారు అని, భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు అని, అది ప్రత్యేకం అని అన్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు