బాలయ్య – బి.గోపాల్ సినిమా కోసం టాప్ రైటర్ !

Published on Mar 12, 2020 11:00 pm IST

బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. పైగా వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. ఆయితే అది గతం.. ప్రస్తుతం గోపాల్ ఫామ్ లో లేడు. పైగా అవుట్ డేటెడ్ డైరెక్టర్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ బాలయ్య మాత్రం తాం తరువాత సినిమాని బి గోపాలే డైరెక్ట్ చెయ్యాలని పట్టు బడుతున్నాడట. దాంతో బి. గోపాల్ ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చేత ఫుల్ స్క్రిప్ట్ రాయిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్ మే నెల‌లో ప్రారంభం అవుతుందట. మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో. ఇక బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More