ఈ సారి పక్కా ప్లాన్ తో వస్తున్న నందమూరి హీరో !

Published on Jul 17, 2018 4:51 pm IST


‘మహానటుడు ఎన్టీఆర్’ మనవడిగా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.
కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా పటాస్ సినిమా దగ్గరనుంచి కళ్యాణ్ రామ్ ఎంతో కష్టపడి తనను తాను మార్చుకుంటూ వస్తూ ఇజంలో ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశారు. ఫిట్ నెస్ తో పాటు, డైలాగ్ మాడ్యులేషన్ లో యాక్టింగ్ లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు.

ఇంతగా తనను తాను మార్చుకుంటున్నప్పటికీ ఆయన సినిమాలు మాత్రం భారీ విజయాల దిశగా వెళ్లట్లేదు. ఒకప్పుడు కథలు బాగున్నా ఆ పాత్రలు ఆయనకు నప్పేవి కావు, ఇప్పుడు ఆయన, పాత్రలకు తగ్గట్టు మారుతున్న కథలు సరైనవి పడట్లేదు. ఐతే ఈ సారి కళ్యాణ్ రామ్ పక్కా ప్లాన్ తో వస్తున్నాడు. పవన్ సాధినేని దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చెయ్యబోతుండగా, ఆ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయింది.ఐతే స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు భారీ విజయం అందించడం ఖాయమని చిత్రబృందం చెబుతుంది. మరి ఈ సినిమాతోనైనా కళ్యాణ్ రామ్ కు ఓ భారీ విజయం దక్కాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

X
More