‘రావణ’గా రానున్న నందమూరి హీరో !

‘రావణ’గా రానున్న నందమూరి హీరో !

Published on Jul 2, 2019 8:07 PM IST

నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా టైటిల్ ‘తుగ్లక్’ అని ఇప్పటికే చిత్రబృందం అనధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ టైటిల్ ను మార్చి ‘రావణ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘రావణ’ టైటిల్ అయితే బి.సి ఆడియన్స్ కి త్వరగా రీచ్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అందుకే టైటిల్ మార్చనున్నారట.

ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ముఖ్యంగా హీరోకి సంబంధించిన సీక్వెన్స్ స్ లో గ్రాఫిక్స్ హైలెట్ గా నిలుస్తాయట.. అందుకే చిత్రబృందం గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించిన ప్రీ ప్లాన్ ను ఇప్పటికే సిద్ధం చేసింది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అటు గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ ను కూడా పూర్తి చెయ్యాలని చిత్రబృందం చూస్తోంది. అలాగే ఈ సినిమా కథ కూడా వెరీ ఇంట్రస్టింగ్ గా ఉండనుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు