మాస్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ

kalyan-ram
2015 మొదట్లో పవర్ఫుల్ పోలీస్ డ్రామా ‘పటాస్’తో సూపర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే వచ్చిన ‘షేర్’ మూవీతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. దీంతో సరైన స్క్రిప్ట్ కోసం కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని మాస్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరితో చేయడానికి ఫిక్స్ అయ్యాడు. గోపీచంద్ తో ‘యజ్ఞం’ సినిమా చేసి రీసెంట్ గా ‘పిల్లా నువ్వులేని జీవితం’తో హిట్ అందుకున్న డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి.

ప్రస్తుతం ఎఎస్ రవికుమార్ చౌదరి గోపీచంద్ తో ‘సౌఖ్యం’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం యూరప్ లో చివరి షెడ్యూల్ జరుగుతున్న ఈ సినిమాని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఎస్ఎస్ రవికుమార్ చౌదరి కళ్యాణ్ రామ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ రవికుమార్ చౌదరి చెప్పిన స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జనవరిలో ఈ సినిమా అధికారకంగా లాంచ్ అయ్యి అదే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ ఎలిమెంట్స్ ని బాగా ప్రెజంట్ చేసే రవికుమార్ పర్ఫెక్ట్ మాస్ రోల్ లో కళ్యాణ్ రామ్ ని చూపించనున్నాడు.

Exit mobile version