టాలెంటెడ్ హీరోయిన్ కొత్త అవతారం !

టాలెంటెడ్ హీరోయిన్ కొత్త అవతారం !

Published on Nov 27, 2018 8:11 AM IST


‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , శ్రీనివాస కళ్యాణం’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు బెంగుళూరు బ్యూటీ నందిత శ్వేత. ఇక ఆమె తాజాగా తెలుగులో ‘అక్షర’ అనే చిత్రంలో నటించనున్నారు. ఇటీవల ఈచిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈచిత్రంలో నందిత ఫిజిక్స్ లెక్చరర్ గా లీడ్ రోల్ లో కనిపించనున్నారు.

బి. చిన్నికృష్ణ తెరకెక్కించనున్న ఈ చిత్రం డిసెంబర్ రెండవ వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రాన్ని హాల్ బ్యానర్ ఫై అహితేజ బెల్లంకొండ, సురేష్ అల్లూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం తో పాటు నందిత చేతిలో మరో 7 తెలుగు చిత్రాలు వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు