నాని , శర్వా ఒకే రోజు రానున్నారా ?

nani sharwa

నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు లో విడుదలకానుందని నిర్మాతలు ప్రకటించారు. ఇక శర్వానంద్ సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ 96 తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. సమంత కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో వున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రాన్ని కూడా ఆగస్టు లోనే విడుదలచేస్తానని దిల్ రాజు ఇంతకుముందే ప్రకటించాడు.

ఇక అదే నెలలో మచ్ అవైటెడ్ మూవీ ‘సాహో’ విడుదలకానుంది. ఈ సినిమాకు వారం ముందుగాని తరువాత గాని ఈ రెండు చిత్రాలను రిలీజ్ చేసే సాహసం చేయలేరు. సో ఈ రెండు చిత్రాలు కూడా ఆగస్టు చివరి వారంలో ఒకే రోజున విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే వీటి విడుదల తేదీ లపై మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version