వరల్డ్ వైడ్ “ఇరుముడి” ఫస్ట్ వీక్ వసూళ్లు.. రవితేజ మొదటి 100 కోట్ల షేర్ సినిమా కాబోతోందా!

మాస్ మహారాజ రవితేజ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవైటెడ్ కంబ్యాక్ ఎట్టకేలకు “ఇరుముడి” తో వచ్చేసింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా రవితేజ స్టార్ పవర్ అంటే ఏంటో ఇది వరకు తన విషయంలో ట్రోల్స్ చేసినవారికి ఒక చెంపపెట్టులా చూపించింది.

ఇలా ఫైనల్ గా రవితేజ నటించిన సినిమా బంపర్ టాక్ తెచ్చుకొని మొదటి వారం రోజుల రన్ ని వరల్డ్ వైడ్ గా పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం రోజుల్లో సినిమా మొత్తం 130 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టినట్టు మేకర్స్ ఖరారు చేసారు. అయితే సినిమా ఆల్రెడీ 70 కోట్ల మేర షేర్ ని రాబట్టేసింది.

పైగా ఇప్పటికీ సినిమా పెర్ఫామెన్స్ ఏమాత్రం చెక్కు చెదరకుండా దూసుకెళ్తుంది. దీనితో లాంగ్ రన్ లో డెఫినెట్ గా ఈ చిత్రం రవితేజకి మొదటి 100 కోట్ల షేర్ సినిమాగా నిలవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీత దర్శకుడిగా పని చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version