నేను పెద్ద స్టార్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు – నాని

నేను పెద్ద స్టార్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు – నాని

Published on Dec 3, 2023 11:00 PM IST

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా హాయ్ నాన్న. డిసెంబర్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. దసరా లాంటి విలేజ్ యాక్షన్ డ్రామా తర్వాత క్లాస్ సినిమా చేయాలని నిర్ణయించుకున్న నాని ఎంపికపై పలువురు ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో నటుడిని ఇదే విషయం గురించి అడిగారు.

తను చేసే సినిమాల పై ప్రేక్షకుల్లో ఎప్పుడూ అంచనాలు ఉండవని నాని అన్నారు. ఖైదీ తర్వాత చిరంజీవి గారు కేవలం మాస్ సినిమాలే చేసి ఉంటే ఆయన ఫిల్మోగ్రఫీ ఇంత గొప్పగా ఉండేది కాదు. చిరంజీవి గారు మాస్‌ లో పెద్ద స్టార్ అయినప్పటికీ, ఆయన సినిమాల ఎంపిక వల్ల అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి గౌరవం లభించిందని నాని అన్నారు. నాని ఇంకా మాట్లాడుతూ, నేను పెద్ద స్టార్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలు కావాలి. ప్రేక్షకులు నా సినిమాల గురించి ఎక్కువసేపు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నన్ను నేను చిరంజీవి గారితో పోల్చుకోవడం లేదు. ఒక ఉదాహరణ మాత్రమే చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు