టీవీ ఛానెళ్ల తీరుని ఖండించిన నాని !

గత వారం రోజులుగా పలు టీవీ ఛానెళ్లలో తెలుగు సినీ పరిశ్రమ గురించి, హీరోయిన్ల గురించి అభ్యంతరకర రీతిలో చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు ఈ అంశాన్ని భూతద్దంలోంచి చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. వీక్షకులు కూడ టీవీ డిబేట్లతో విసుగెత్తిపోతున్నారు.

దీనిపై ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు స్పందించగా హీరో నాని ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ టీవీ ఛానెల్స్, వాటి వ్యాఖ్యాతలు, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తెలుగు పరిశ్రమపై అదే పనిగా దుష్ప్రచారం సాగించడాన్ని తాను ఖండిస్తున్నానని, భవిష్యత్తును నిర్ణయించడంలో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని, పిల్లలు టీవీలు చూస్తుంటారని, దయచేసి ఇకనైనా ఈ వివాదానికి ఫులుస్టాప్ పెట్టాలని కోరగా మరొక హీరో సుధీర్ బాబు కూడ హీరోయిన్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ న్యూస్ ఛానెల్ హోస్ట్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.