ఐదుగురు అమ్మాయిల “గ్యాంగ్ లీడర్” గా నాని, ప్రీ లుక్

ఐదుగురు అమ్మాయిల “గ్యాంగ్ లీడర్” గా నాని, ప్రీ లుక్

Published on Jul 13, 2019 11:27 AM IST

హీరో నాని తన తదుపరి చిత్రంగా విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో “గ్యాంగ్ లీడర్ ” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలకపాత్ర చేస్తుండగా ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఎప్పుడో చిత్రీకరణ మొదలైన ఈ చిత్రం పై అభిమానులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఒకింత అసహనానికి గురవుతున్నారు.

దీనికి సస్పెన్సు కి తెరదించుతూ హీరో నాని ట్విట్టర్ వేదికగా నిన్న ఓ ప్రకటన చేయడం జరిగింది. అదేంటంటే 13న ఉదయం 11గంటలకి “గ్యాంగ్ లీడర్” మూవీ ప్రీ లుక్ ని విడుదల చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది . చెప్పిన విధంగా కొద్దిసేపటిక్రితం ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ని నాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

“గ్యాంగ్ లీడర్” ప్రీ లుక్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు అనేక అనుమానాలు రేపేదిగా ఉంది. నాని చేతిలో ఇంకో ఐదుగురు వ్యక్తులు చేతులు వేసి, ఓ లక్ష్యం కోసం ప్రమాణం చేస్తున్నట్లుగా పోస్టర్ ఉంది. ఐతే మనం జాగ్రత్తగా గమనిస్తే నానితో చేయికలిపిన ఆ ఐదుగురు వ్యక్తుల చేతులు అమ్మాయిలవి వలే ఉన్నాయి. సాధారణంగా గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ సభ్యులు అబ్బాయిలై ఉంటారు. ఆసక్తికరంగా నాని గ్యాంగ్ లో ఐదుగురు అమ్మాయిలున్నట్లు అనిపిస్తుంది. ఈ ఐదుగురు అమ్మాయిలు,నాని తో ఎందుకు,ఎవరిపై పోరాటానికి చేయికలిపారు, అనేది ప్రధాన కథాంశంగా గ్యాంగ్ లీడర్ కనిపిస్తుంది. ప్రీ లుక్ పోస్టర్ లోనే ఫస్ట్ లుక్ 15న,ఫస్ట్ సాంగ్ 18న,టీజర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు