చిన్న లీక్: ‘ప్యారడైజ్’ నుంచి మెలోడీ చార్ట్ బస్టర్ లీక్ చేసిన నాని!

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ది ప్యారడైజ్’. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఇపుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి.

ఇక ఈ గ్యాప్ లో మూడో సాంగ్ కూడా రానున్నట్టు మేకర్స్ తెలుపగా లేటెస్ట్ గా నాని దీనిపై చిన్న లీక్ అంటూ ఓ క్లిప్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అనిరుద్ తన స్టూడియో నుంచి మూడో సాంగ్ ని పాడుతున్న క్లిప్ ని షేర్ చేయగా ఈ కొంచెం బిట్ కూడా మంచి చార్ట్ బస్టర్ వైబ్స్ తో ఉందని చెప్పవచ్చు.

ఆల్రెడీ రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అనిరుద్ డెలివర్ చేసాడు. ఇక మూడో సాంగ్ ఇపుడు లోడ్ అవుతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి డేట్ ఇవ్వలేదు కానీ త్వరలోనే విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమాకి ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 24న సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version