‘ది ప్యారడైజ్’లో జడల్ బ్లాస్టింగ్ ఎంట్రీ సాంగ్..!

The Paradise

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise )షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ భారీ విజయం సాధించడంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో నానిపై ఒక గ్రాండ్ ఇంట్రొడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

ఈ సినిమాలో నాని జడల్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని 2026 జూలై 25న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, బాబు మోహన్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Exit mobile version