‘శంభో శివ శంభో’ ఫేం సముద్రఖని దర్శకత్వంలో యువ హీరో నాని నటించిన సినిమా ‘జెండా పై కపిరాజు’. కెరీర్ లో తొలిసారిగా నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. నాని సరసన అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటించారు. నిన్ను నువ్వు సరిదిద్దుకుంటే ప్రపంచం మొత్తం సరవుతుంది. మన సమాజంలో ఉన్న చెడుపై ఓ యువకుడు చేసే పోరాటాన్ని కధాంశంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.
సామాజిక సందేశంతో కూడిన ఈ సినిమా నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నవంబర్ 28న సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శరత్ కుమార్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ భాద్యతను తన భుజాన వేసుకున్నారు. తనికెళ్ళ భరణి, ఆహుతి ప్రసాద్, ధనరాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. రజిత్ పార్ధసారధి నిర్మాత. జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.


