నాచురల్ స్టార్ నాని నయా గెటప్ లో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ట్రిమ్డ్ షేవ్ మరియు హెయిర్ కట్ లో ఉన్న నాని స్టైలిష్ మేకోవర్ కేకగా ఉంది. నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సడన్ గా నాని కనిపించడంతో అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలలో ఆయనను బంధించారు. నాని తాజా లుక్ ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ వి కోసం అని సమాచారం. గతానికి భిన్నంగా నాని సైలిష్ లుక్ చూస్తుంటే వి మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి మూవీ తెరకెక్కుతుంది. నాని ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియస్ సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నాడు. మరో హీరో సుధీర్ అతన్ని వెంటాడే పోలీస్ లా కనిపిస్తాడని సమాచారం. మలేసియా, థాయిలాండ్ లతో పాటు ఇండియాలోని మనాలి వంటి అనేక క్రేజీ లొకేషన్స్ లో వి మూవీ తెరకెక్కిస్తున్నారు. నాని 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా.. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



