హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి నాని

హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి నాని

Published on Jan 30, 2020 12:02 AM IST

నాని కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్లలో ‘భలే భలే మగాడివోయ్’ కూడా ఒకటి. ఈ సినిమాతో నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావించారు. మారుతి, నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని చాలాసార్లే అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు.

అయితే త్వరలో వీరి కాంబినేషన్ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు వీరి ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మించే వీలుంటుందట. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అందేవరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ‘వి’ చిత్రం చేస్తున్న నాని త్వరలో ‘టక్ జగదీష్’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఇక మారుతి విషయానికొస్తే ఇటీవలే ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఆయన ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ అనౌన్స్ చేయలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు