
ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ అంటూ వచ్చి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాని చివరి దశకు తీసుకువచ్చేసాడు. ఈ సినిమా అలా చివరికి వచ్చిందో లేదో అప్పుడే తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో పడ్డాడు. అందులో భాగంగానే ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో చేయనున్న సినిమాని అధికారికంగా లాంచ్ చేసేసాడు. ఈ సినిమాలో నాని సరసన సురభి, నివేద థామస్ హీరోయిన్స్ గా నటించనున్నారు.
ఇటీవలే నాని మోహనకృష్ణ ఇంద్రగంటిల సినిమా ఎమోషనల్ లవ్ స్టొరీతో సాగే థ్రిల్లర్ అని, ఈ జానర్ సినిమా తెలుగులో ఇప్పటి వరకూ రాలేదని తెలిపాము. ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే సీక్రెట్ తెలిసిపోయింది. అదేమిటంటే ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ నేపధ్యంలో జరుగుతుంది, మర్డర్ మిస్టరీలోని సస్పెన్స్ అందరినీ థ్రిల్ చేసేలా ఉంటూనే, నాని మార్క్ లవ్ అండ్ కామెడీ కూడా ఉంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ఈ సినిమాని డిసెంబర్ చివరి వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.