భారీ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నాని ‘హాయ్ నాన్న’

భారీ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నాని ‘హాయ్ నాన్న’

Published on Dec 10, 2023 2:17 AM IST


నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో బాబీ కియారా ఖన్నా, జయరాం, ప్రియదర్శి తదితరులు నటించారు. యువ దర్శకడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించగా హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.

విషయం ఏమిటంటే, రెండు రోజుల క్రితం మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కి మెల్లగా ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉండడంతో పాటు కలెక్షన్స్ కూడా ఒక్కసారిగా బాగా పెరిగాయి. ముఖ్యంగా వీకెండ్ కావడంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై మరియు యుఎస్ఏ వంటి ప్రాంతాల్లో నేడు ఈ మూవీ భారీ స్థాయి ఆక్యుపెన్సీ తో కొనసాగుతోంది.

మరోవైపు నిన్న రిలీజ్ అయిన నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ పెద్దగా టాక్ అందుకోకపోవడం కూడా హాయ్ నాన్నకి బాగా కలసి వచ్చిందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇక రేపు ఆదివారం కావడంతో మూవీ మరింతగా కలెక్షన్ అందుకోవడం ఖాయం అని, మరి మొత్తంగా రాబోయే రోజుల్లో హాయ్ నాన్న ఎంతమేర రాబడుతుందో చూడాలని పలువురు ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు