ది ప్యారడైజ్ : ఓటీటీ కోసం నాని కొత్త ప్లానింగ్..?

ది ప్యారడైజ్ : ఓటీటీ కోసం నాని కొత్త ప్లానింగ్..?

Published on Oct 10, 2026 2:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ది ప్యారడైజ్’ థియేటర్లలో టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా, ప్రేక్షకుల అంచనాలను మాత్రం పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది. ప్రీ-రిలీజ్ హైప్‌కు తగ్గట్టుగా కంటెంట్ లేకపోవడంతో నాని మరియు శ్రీకాంత్ ఓదెలలపై కొంత విమర్శలు కూడా వచ్చాయి.

అయితే, తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ వెర్షన్ కోసం నాని స్వయంగా కొన్ని కీలక మార్పులు చేర్పులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే దర్శకుడు శ్రీకాంత్ ఈ విషయంపై మాట్లాడగా, ఇప్పుడు థియేట్రికల్ వెర్షన్‌లో కట్ అయిన కొన్ని అన్‌సీన్ సీన్లను జోడించి ఓటీటీలో విడుదల చేసేందుకు నాని ప్లాన్ చేస్తున్నారట.

ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో కయాదు లోహర్, మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి మరియు రాఘవ్ జుయల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ కొత్త మార్పులతో ఓటీటీ ప్రేక్షకులను ‘ది ప్యారడైజ్’ ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు