తన స్ట్రాంగ్ జోన్ లో నాని ర్యాంపేజ్.!

తన స్ట్రాంగ్ జోన్ లో నాని ర్యాంపేజ్.!

Published on Dec 10, 2023 10:00 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా అలాగే మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా చిత్రం “హాయ్ నాన్న”. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ చిత్రం అయితే అంచనాలు అందుకొని ప్రతి రోజు మరింత బెటర్ గా అయితే దూసుకెళ్తుంది.

అయితే నాని కి తెలుగు స్టేట్స్ లో కూడా అంతగా రాణించని సినిమాలు సైతం యూఎస్ మార్కెట్ లో మాత్రం 1 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసినవి ఉన్నాయి. దీనితో తనకి మాత్రం ఎప్పటి నుంచో యూఎస్ మార్కెట్ లో మంచి పట్టు ఉంది. ఇక లేటెస్ట్ గా హాయ్ నాన్న తో అయితే నాని తన ర్యాంపేజ్ చూపిస్తున్నాడు.

ఇంకా వీకెండ్ కంప్లీట్ కాకుండానే హాయ్ నాన్న చిత్రం అక్కడ ఏకంగా 1 మిలియన్ మార్క్ కి దగ్గరకి వచ్చేసాడు. లేటెస్ట్ హా ఈ సినిమా 9 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని టచ్ చేసింది. దీనితో తన ఖాతాలో మరో 1 మిలియన్ డాలర్ మార్క్ సినిమా పడింది అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ టార్గెట్ అయితే 1.5 మరియు 2 మిలియన్ డాలర్స్ అనే చెప్పాలి. వీటిని కూడా ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు