చెన్నై సూపర్ కింగ్స్ కు బదులిచ్చిన నాని..!

Published on Apr 6, 2021 7:01 am IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ అత్యంత సహజ నటుడు నాని ఇప్పటి వరకు ఎన్నో అపురూపమైన పాత్రలు పోషించారు. మరి ఇప్పటి వరకు ఓ నటుడుగా తన బెస్ట్ ఏదన్నా ఉంది అంటే అది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసిన “జెర్సీ” లో అనే చెప్పాలి. మరి ఇప్పుడు దీనిపైనే ప్రసిద్ధ ఐపీఎల్ టీం అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంపిక కాబడిన తెలుగు యువ ఆటగాడు హరి శంకర్ రెడ్డిపై ఓ స్పెషల్ వీడియో చేసి పెట్టారు.

అందులో హరి తాను చెన్నై టీం కు ఎంపిక కావడం తాను కూడా నానికి అభిమానినే చెప్పడం ఆ అవకాశం వచ్చినపుడు జెర్సీ సినిమాలో నాని చేసిన ల్యాండ్ మార్క్ ట్రైన్ సీన్ కు రిలేటెడ్ చెప్పడం వంటివి ఉన్నాయి. దీనితో ఈ స్పెషల్ వీడియోని చూడాలని చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వారు నానిని ట్యాగ్ చేసి అడగ్గా అందుకు బదులుగా నాచురల్ స్టార్ నాని “చూసేసా” అంటూ తన సింపుల్ రిప్లై ఇచ్చారు.. దీనితో నాని సహా చెన్నై టీం ను అభిమానించే వారు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

సంబంధిత సమాచారం :