పవన్ తర్వాత సుజీత్ తో తన సినిమా ఎలా ఉంటుందో చెప్తున్న నాని

పవన్ తర్వాత సుజీత్ తో తన సినిమా ఎలా ఉంటుందో చెప్తున్న నాని

Published on Feb 25, 2024 1:53 AM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ యంగ్ అండ్ స్టార్ హీరోస్ లో సుజీత్ కూడా ఒకడు. మరి సుజీత్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఓజి” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నానితో సినిమా ఉంటుంది అని టాక్ వచ్చింది. మరి ఇది అఫీషియల్ గా ఈరోజు నాని బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసేసారు. అయితే ఈ సినిమా విషయంలో నాని పెట్టిన పోస్ట్ మరింత ఎగ్జైట్మెంట్ ని ఫ్యాన్స్ లో తీసుకొచ్చింది.

ఆల్రెడీ నానికి పవన్ కళ్యాణ్ కి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు. వారికి తన పోస్ట్ మంచి కిక్ ఇస్తుంది. ఇది సుజీత్ చిత్రం, ‘పవర్’ తర్వాత ‘లవర్’ తో వస్తున్నాడు అని పవన్ తో పవర్ఫుల్ ప్రాజెక్ట్ అనంతరం తనతో మంచి లవ్ స్టోరీతో సినిమాతో వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. మరి అనౌన్సమెంట్ గ్లింప్స్ లో కూడా మేకర్స్ ఈ తరహా పాయింట్ నే చూపించారు. మరి నానితో అయితే సుజీత్ ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు