ఆయా షేర్ తో నాని మరో అరుదైన రికార్డు..!

ఆయా షేర్ తో నాని మరో అరుదైన రికార్డు..!

Published on Mar 3, 2026 3:38 PM IST

The-Paradise

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ది ప్యారడైజ్”. దీనిపై అప్పుడు వరకు ఉన్న అంచనాలు వేరు ఆయా షేర్ అనే మొదటి సాంగ్ వచ్చిన తర్వాత ఏర్పడ్డ అంచనాలు వేరు అని చెప్పాలి. అనిరుద్ మ్యూజిక్ కి నాని డాన్స్ అండ్ మాస్ గ్రేస్ తోడై ఈ సాంగ్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది.

కేవలం తెలుగులోనే విడుదలైనప్పటికీ ఈ సాంగ్ కి పాన్ ఇండియా రీచ్ వచ్చేసింది. మొదటి 24 గంటల్లోనే టైర్ 1 హీరోస్ రేంజ్ లో వ్యూస్, లైక్స్ కొల్లగొట్టిన నాని ఇప్పుడు మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయా షేర్ సాంగ్ ఇప్పుడు 1 మిలియన్ లైక్స్ ని యూట్యూబ్ లో క్రాస్ చేసి నాని కెరీర్ లో ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్స్ కలిగిన లిరికల్ సాంగ్ గా నిలిచి రికార్డు సెట్ చేసింది. అంతే కాకుండా యూట్యూబ్ ట్రెండ్స్ ఛార్ట్స్ లో 158 గంటలకి పైగా ఈ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగింది. మొత్తానికి మాత్రం ఆయా షేర్ తో నాని భారీ రెస్పాన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు