నాచురల్ స్టార్ నాని టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్ర గంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వి’. దర్శకుడు ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. గతానికి భిన్నంగా నాని సరికొత్త రోల్ చేస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ గా నాని రోల్ ఉంటుందని సమాచారం. ‘వి’ మూవీని అధిక బడ్జెట్ తో చాలా రిచ్ గా నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే తాజా షెడ్యూల్ కొరకు మనాలి వెళ్లిన చిత్ర బృందం అక్కడ షూటింగ్ పూర్తి చేశారట. మనాలిలో గడ్డ కట్టించే చలిలో సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారట.
దర్శకుడు మోహన్ కృష్ణ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక హీరో సుధీర్ కథలో కీలకమైన పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చ్ 25న ‘వి’ చిత్రం విడుదల కానుంది. అమిత్ త్రివేది ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/mokris_1772/status/1209905001578938368
