న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీగా నిలిచిన ‘నిన్ను కోరి’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ జర్నీని పంచింది. ఇప్పుడు ఈ క్లాసిక్ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రాన్ని మే 8, 2026న థియేటర్లలో భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయనున్నారు. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి లీడ్ రోల్స్‌లో నటించగా గోపీ సుందర్ అందించిన మ్యాజికల్ మెలోడీలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వేసవి సెలవుల కానుకగా వస్తున్న ఈ చిత్రం, నాని అభిమానులకు వెండితెరపై మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తు చేయనుంది.
డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ రొమాంటిక్ ట్రీట్ ప్రేక్షకులను మరోసారి ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


