హాయ్ నాన్న: బన్నీ కి నాని థాంక్స్!

హాయ్ నాన్న: బన్నీ కి నాని థాంక్స్!

Published on Dec 11, 2023 2:04 PM IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ను చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదిక గా అప్రిషియేషన్ పోస్ట్ చేశారు.

హీరో నాని పెర్ఫార్మెన్స్ పై, మృణాల్ ఠాకూర్ అభినయం పై, బేబీ కియారా క్యూట్ నెస్ గురించి ప్రస్తావించారు. వీరితో పాటుగా చిత్రం లో నటించిన ఇతర నటీనటులకు కంగ్రాట్స్ తెలిపారు బన్నీ. సినిమాటోగ్రాఫర్ కి, మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహాబ్ కి, డైరెక్టర్ శౌర్యువ్ కి స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు. కేవలం తండ్రులను మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులను కూడా హాయ్ నాన్న అలరిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు బన్నీ.

బన్నీ చేసిన పోస్ట్ కి గాను హీరో నాని రెస్పాండ్ అయ్యారు. అర్హ నాన్న సినిమాను అప్రూవ్ చేశారు. థాంక్యూ బన్నీ అంటూ చెప్పుకొచ్చారు. మంచి సినిమా కోసం బన్నీ ఎప్పుడూ ఉంటారు అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు