‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ప్యారడైజ్ మేకర్స్ కూడా ఈ స్టెప్ తీసుకోబోతున్నారా?

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ప్యారడైజ్ మేకర్స్ కూడా ఈ స్టెప్ తీసుకోబోతున్నారా?

Published on Sep 9, 2026 7:07 AM IST

ఇటీవల టాలీవుడ్ దగ్గర సంచలన హిట్ అయ్యిన చిత్రమే ఇరుముడి. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకి సాలిడ్ టాక్ పడే సరికి భారీ లాంగ్ రన్ ని ఈ సినిమా చూసింది. అయితే ఈ సినిమా సక్సెస్ మంత్రా లో టికెట్ ధరల పాత్ర కూడా చాలా ఉంది. ఎలాంటి హైక్ లు లేకుండా వచ్చిన ఈ సినిమాకి ఆ స్టెప్ బిగ్ ప్లస్ అయ్యింది.

ఇప్పుడు ఇదే సక్సెస్ మంత్రా తో నాచురల్ స్టార్ నాని బిగ్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ కూడా మన దగ్గర రాబోతుంది అంటూ పలు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే బడ్జెట్ పరంగా దీనికి చాలా ఎక్కువ. సో అయినప్పటికీ సాధారణ టికెట్ ధరల తోనే వస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

వస్తే అది ఖచ్చితంగా బిగ్ ప్లస్ అవుతుంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు