నానికి పోటీగా సూర్య దిగుతున్నాడు

నానికి పోటీగా సూర్య దిగుతున్నాడు

Published on Jul 7, 2019 4:40 PM IST

హీరో సూర్య చేస్తున్న కొత్త చిత్రం ‘కాప్పన్’. కెవి ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో సూర్య పవర్ఫుల్ కమాండో ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘బందోబస్త్’ పేరుతో విడుదలకాలనుంది. ఇటీవలే విడుదలైన తెలుగు టీజర్ కూడా బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

దీంతో తమిళంతో పాటు తెలుగులో కూడా చిత్రం ఆగష్టు 30వ తేదీనాడే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అదే రోజు విక్రమ్ కుమార్, నానిల కలయికలో రూపొందుతున్న ‘గ్యాంగ్ లీడర్’ విడుదలకానుంది. ఆ రోజు ఈ రెండు సినిమాలు మాత్రమే విడుదలకానున్నాయి. నాని చిత్రం మీద కూడా అంచనాలు భారీగానే ఉండటంతో ఈ రెండు చిత్రాల నడుమ గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ‘జెర్సీ’ సినిమా విజయంతో నాని ఊపు మీద ఉండగా వరుస పరాజయాలతో డీలా పడిన సూర్య ఈ చిత్రంతోనైనా పూర్వ వైభవం తెచ్చుకోవాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు