‘నాని’ మరో వినూత్నమైన కథతో ?

‘నాని’ మరో వినూత్నమైన కథతో ?

Published on Nov 14, 2019 7:27 AM IST

కథలను జడ్జ్ చేయడంలో నానికి మంచి అవగాహన ఉందని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నేమాట. దానికి తగ్గట్లుగానే ‘నాని’ ఎప్పటికప్పుడు వినూత్నమైన సహజ కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ శైలిని ఏర్పరుచుకున్నారు. పైగా కథ బాగుంటే దర్శకుడి ట్రాక్ రికార్డ్ ను కూడా పట్టించుకోకుండా, నాని కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు.

కాగా తాజాగా నాని, మహేష్ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ విని.. అతనితో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం నాని తరువాత సినిమా ఇదేనని.. పైగా ఈ చిత్రాన్ని స్వయంగా నానినే నిర్మిస్తాడని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. ఇక నాని హీరోగా నటించిన అతని లాస్ట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎబౌవ్ ఏవరేజ్ చిత్రంగా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు