నెవర్ బిఫోర్ గా నాని.?

నెవర్ బిఫోర్ గా నాని.?

Published on Feb 22, 2024 8:00 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “హాయ్ నాన్న” తో తన కెరీర్ లో మరో మంచి హిట్ ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నాని కెరీర్ లో బెంచ్ మార్క్ 30వ సినిమా కావడం అది కూడా హిట్ అవ్వడంతో ఇక తన నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. అలా తాను ఇప్పుడు చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “సరిపోదా శనివారం” పై బజ్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా కంప్లీట్ చేసుకొని అప్పుడే అప్డేట్స్ కూడా స్టార్ట్ చేసుకుంటుంది. ఇక మేకర్స్ టీజర్ డేట్ ని కూడా లాక్ చేయగా దీనిపై ఇంట్రెస్టింగ్ బజ్ తెలుస్తుంది. ఈ టీజర్ లో మాత్రం నాని నెవర్ బిఫోర్ లుక్ అండ్ ట్రీట్ ని ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. కంప్లీట్ గా ఒక డిఫరెంట్ ట్రీట్ ని నాని అండ్ వివేక్ ఆత్రేయలు అందిస్తున్నారని టాక్. మరి ఈ సాలిడ్ టీజర్ కట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు