నాని ‘భలే భలే మగాడివోయ్’ రిలీజ్ డేట్

Bhale-Bhale-Magadivoy
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో కంటెంట్ ఉంటే చాలు లో బడ్జెట్ తో కూడా బిగ్ హిట్ కొట్టచ్చు అనే సరికొత్త రికార్డ్ సృష్టించిన అని నిరూపించిన డైరెక్టర్ మారుతి. అలా వచ్చిన సినిమాలే ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్, కొత్త జంట. ఈ సినిమాల సక్సెస్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న మారుతి టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో నానితో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’. యంగ్ హీరో నాని సరసన అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ మరియు ఆడియోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

దాదాపు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ప్రస్తుతం డాల్బీ అట్మాస్ మిక్సింగ్ పనులను చేస్తున్నారు. మామూలుగా పెద్ద సినిమాలకే చేసే ఈ డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్స్ ని ఈ సినిమాకి చేయడం విశేషం. అలాగే ఈ సినిమాని సెప్టెంబర్ 4న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నాని ఓ మతిమరుపు పర్సన్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ లో తను మతిపరుపు వ్యక్తిగా చేసిన పెర్ఫార్మన్స్, కామెడీ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. అలాగే గోపి సుందర్ అందించిన ఆడియోకి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ వారు యువి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి చేసిన సినిమా ఇది.

Exit mobile version