నాని ‘గ్యాంగ్ లీడర్’కు భారీ రిలీజ్ దొరికింది

నాని ‘గ్యాంగ్ లీడర్’కు భారీ రిలీజ్ దొరికింది

Published on Sep 4, 2019 10:44 PM IST

నేచ్యురల్ స్టార్ నాని నటించిన కొత్త చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై పాజిటివ్ క్రేజ్ నెలకొని ఉంది. సాధరణంగానే నాని సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ ఉంటుంది.

అందుకే అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెద్ద ఎత్తున విడుదల ప్లాన్ చేసింది. సుమారు 200లకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు నానికి ఇదే అతిపెద్ద రిలీజ్. దీంతో సినిమా ఓపెనింగ్స్ మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు