‘గ్యాంగ్ లీడర్’ గట్టిగానే వసూలు చేయాల్సి ఉంటుంది

Published on Sep 11, 2019 12:02 am IST

నాని కొత్త చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ఈ నెల 13న విడుదలకానున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకుడు. ఈ సినిమాపై నాని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో తన మార్కెట్ స్థాయిని మరింత స్థిరపరుచుకోవాలని చూస్తున్నాడు. ఆయన గత చిత్రం ‘జెర్సీ’ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ రూ.29 కోట్లకు దగ్గర్లో ఆగిపోయింది. దీంతో ఆయన కొంత నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పాలి.

ఇక ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.28.20 కోట్లు జరిగిందని ట్రేడ్ టాక్. ఈ మొత్తం రికవర్ చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా సూపర్ హిట్ కావాలి. వసూళ్లు ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ లెవల్లో ఉండాలి. అప్పుడే నాని మార్కెట్ రూ.35 నుండి 40 కోట్లకు స్థిరపడుతుంది. మరి చూడాలి ఫలితం ఎలా ఉంటుందో.

సంబంధిత సమాచారం :

X
More