నాని “సరిపోదా శనివారం” రిలీజ్ అప్పుడే?

నాని “సరిపోదా శనివారం” రిలీజ్ అప్పుడే?

Published on Dec 10, 2023 2:02 PM IST

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకు పోతున్నారు. రీసెంట్ గా రిలీజైన హాయ్ నాన్న మూవీ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. నాని తన తదుపరి చిత్రం సరిపోదా శనివారం ను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అంటే సుందరానికి సినిమాను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ తో హీరో నాని మరోసారి జత కట్టారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలక్షణ నటుడు ఎస్. జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు