‘టక్ జగదీష్’తో నాని కొత్తగా రాబోతున్నాడట !

‘టక్ జగదీష్’తో నాని కొత్తగా రాబోతున్నాడట !

Published on Feb 19, 2020 6:42 PM IST

టాలీవుడ్ లోని మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ ‘నాని’ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా ఇది. అయితే నాని ఈ సినిమాలో కొత్త లుక్ ట్రే చేస్తున్నాడట. ప్రధానంగా నాని క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

కాగా షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం. నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. మరి నిన్నుకోరితో హిట్ అందుకున్న ఈ హిట్ కాంబినేషన్ ఆ హిట్ మేజిక్ ను రిపీట్ చేస్తోందా..? చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు