‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్ డేట్?

‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్ డేట్?

Published on Dec 7, 2015 8:30 AM IST

Nannaku-Prematho
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సూపర్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రానున్న ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా కానుకగా రిలీజ్ చేసిన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా యు ట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్పెయిన్ లో జరుగుతోంది. దాదాపు డిసెంబర్ 20వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియో రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ నరగ్లో వార్తలు వినిపిస్తున్నాయి. వారు చెబుతున్న దాని ప్రకారం డిసెంబర్ 25న నాన్నకు ప్రేమతో ఆడియోని రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రకాల పనులను వేగవంతం చేసింది ఈ చిత్ర టీం. షూటింగ్ జరుగుతున్నప్పటికీ మిగతా ఫినిష్ అయిన పార్ట్ కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు