నందమూరి ఫ్యామిలీ మూడవ జెనరేషన్ లో స్టార్డంతో పాటు, స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఇప్పటి వరకూ 24 సినిమాల్లో నటించిన ఎన్.టి.ఆర్ చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పై వచ్చే ఓ ఇంట్రడక్షన్ సాంగ్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఈ చిత్ర టీం ఓ లాంగ్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నాడు.
ఇప్పటికి 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటి, ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ బాలన్స్ ఉంది అనే విషయాలను తెలుసుకుంటే.. నాన్నకు ప్రేమతో షూటింగ్ ఇంకా 30-40 రోజుల షూటింగ్ బాలన్స్ ఉంది. అందుకోసమే ఎన్.టి.ఆర్ గ్యాప్ లేకుండా స్పెయిన్ షెడ్యూల్ తర్వాత చేయాల్సిన హైదరాబాద్ షెడ్యూల్ ని ఇప్పుడే ఫినిష్ చేసేస్తున్నాడు. అనుకున్న టైం ప్రకారమే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ఎన్.టి.ఆర్ అవుట్ అండ్ అవుట్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.


